Pages

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

నీ ఆరాధకుడను....

ప్రేమంటే...
కోరుకోవడం
అభిమానించడం
పూజించడం,,,,,

స్నేహంటే..
ఎదుటివారి ఇష్టాన్ని తనిష్టంగా మార్చుకోవడం
ఎలాంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం

మరి ఆరాధించడమంటే....
ప్రేమ...
స్నేహం...
ఆ రెండూ పాలు... పంచదారలా కలిస్తే...
ప్రేమికుడివా... స్నేహితుడివా... అని నువ్వడిగితే

ఖచ్చితంగా నేను నీ ఆరాధకుడను....
నిన్ను గుడ్డిగా ఆరాధించే  ఆస్వాదకుడను
అనురక్తుడను నీ ప్రియ భక్తుడను

ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు

నేస్తం ఎంత నిశ్శబ్దంగా
నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెళ్ళావు
వెళ్తూ వెళ్తూ బోలెడు వసంతాన్ని
బతుకంతా వర్షించి వెళ్ళావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాల పూదోటలో
ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు
ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో పదిలపర్చావు
నిజానికవి జ్ఞాపకాలు కావు... ఓ ప్రవాహం
ప్రవాహాన్ని దాచుకోవడం ఎలా సాధ్యం....
అందుకే నేస్తం
ఆ జ్ఞాపకాల ప్రవాహం..
ఆ  అక్షర ఝరి.. చేస్తోంది నీకు అభిషేకం...

కనులనొదలిపోయే చూపులతో కనులారా ‘తనని’ చూడాలి

నిన్నలన్నీ తెలిసిన సమయమా...
కదలక నిలిచిపోవా కాసేపు...
కనులనొదలిపోయే చూపులతో
కనులారా ‘తనని’ చూడాలి
మనసారా మాట్లాడాలి
సంపూర్ణమైంది నా జీవితం
ఆకాశమంత ఆనందంతో..

’’ ‘రుషి‘ సినిమా చివరలో వచ్చే
ఈ నాలుగు మాటలు నన్నెంతో కదిలించాయి....’’

15, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్ఞాపకాల హారతి నువ్వు

గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
వెలుగులు నింపుతూనే వుంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను పంపించలేను
మది అంధకారం చేసుకోలేను
అలాగని... జీవితానికి నిన్ను అభిషేకించనూలేను
ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు
మది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో  నా ఆత్మీయ నేస్తమా….. నిన్ను
గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో...

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం

జాబిలి కన్న నా చెలి మిన్న
పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను

-- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...  నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం

తానొక చైతన్య కెరటం...

తానొక చిరుగాలి...
నన్నెప్పుడూ అనుభూతింపజేస్తూనే వుంటుంది
తానొక జలపాతం...
ఆ నడతలోని గంభీరత కట్టిపడేస్తూనే వుంటుది
తానొక గీతం...
మళ్ళీ మళ్ళీ పాడాలనిపిస్తూనే వుంటుంది
తానొక భావ తరంగం...
నామదినెప్పుడూ తనచుట్టూ తిప్పుకుంటూనే వుంటుది
తానొక ప్రేమమయి
అది పొందలేని అభాగ్యుడ్ని.. అయినా అర్రులుచాస్తూనే వుంటుంది
తానొక స్నేహమయి...
ఎప్పుడూ పరిమిళిస్తూనే వుంటుంది
తానొక చైతన్య కెరటం...
నాకెప్పుడూ స్ఫూర్తినిస్తూనే వుంటుంది

13, ఫిబ్రవరి 2012, సోమవారం

నేస్తానికి లేఖ

నాతో మాట్లాడకుండా వుండడమే నీకు సంతోషమైతే... అలాగే కానీ...
కానీ... అది నాకెంత నరకతుల్యమో బహుశా నీకు తెలుసనే అనుకుంటున్నా...
అయినా... తప్పేమిటో చెప్పకుండా శిక్ష విధించడం భావ్యమా..
నాకున్న ఒకే ఒక నేస్తం నువ్వు... నువ్వే నాపై యుద్ధం ప్రకటిస్తే నేనెవరికి చెప్పకోను...
దాదాపు 20రోజులుగా మౌనంగా వుంటే ఏమిటో అనుకున్నాను.
ఇవాళే తెలిసింది... నలుగురితో సమంగా నన్నూ జమకట్టావు...
అదిమాత్రం భరించలేకుండా వున్నా...
ఒకవేళ నా తప్పేదైనా వుంటే...నువ్వీ తప్పు చేశావని చెప్పి
నన్ను తిట్టినా అంత బాధపడేవాడిని కాదు...

నువ్వు రాసిందానికి ఒక్కమాటలోనే రాద్దామనుకున్నా... కానీ కొంచెం ఎక్కువగానే రాసేసాను. ఈ ఒక్కసారికి విసుక్కోకుండా చదువుకో..  ఎందుకంటే... నీ అంత బాగా నేను మాట్లాడలేను... చెప్పలేను...రాయలేను. ఇకపోతే ‘అంతగా పెంచుకుంటే ఇలాగే అవుతుంది’..అంటున్నావు. అప్పుడు నాకా విషయం తెలియదు. మన మధ్య ఎప్పటికీ గొడవ రాదని ఎన్నోసార్లు అన్నావు. నీకు గుర్తులేదేమో... నా దురదృష్టం కాకపోతే ఏమిటి... 26వ తేదీన సరదాగా అన్నాను.. ‘కటీఫ్’ అని. నీకు గుర్తుండే వుంటుంది. పెద్దోళ్ళు అంటుంటారు కదా తథాస్తు దేవతలుంటారని. నేను ‘కటీఫ్’ అన్నప్పుడు ఎవరో ‘తథాస్తు’ అనివుంటారేమో..(నమ్మకాలగురించి కాసేపు పక్కనపెడదాం).  కాని  కొన్ని జీవితాలంతే.. ఎప్పుడూ ఏదోకటి పోగొట్టుకుంటూనే వుంటాయి. నేనూ అంతే...  ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను బాధపెట్టే సంఘటన ఏదో జరిగిందని మాత్రం నీ మాటలను బట్టి అర్థమౌతోంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నావల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా, తెలిసో తెలియకో నీ మనసు నొప్పించినా నన్ను క్షమించు.  ఒక్కటి మాత్రం నిజం... నా వ్యక్తిగత విషయాలను కూడా మనస్సు విప్పి చెప్పుకోగలిగిన ఒకే ఒక ఆత్మబంధువు నువ్వు. ఆ విషయం నీకూ తెలుసు. అయినా... ఎంతకాలం బతుకుతాడో తెలియని వ్యక్తితో గొడవెందుకు...చెప్పు...అలాగని భరించాలనీ లేదులే... ఇకపోతే, రిటైర్ అయ్యి  మా ఊరు వెళ్ళిపోయే రోజున నీకో ఫ్లాష్ బ్యాక్ చెప్పాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని. ఇప్పుడదీ ప్రశ్రార్థకమే... అలాంటి రోజంటూ వస్తే కదా... ఇకముందెప్పుడూ నిన్ను డిస్ట్రబ్ చెయ్యను. ఇక సెలవు... మిత్రమా..సెలవు. . ఈ వాక్యం రాయాలంటే మనసు పిండేసినట్టుంది. ఎప్పటికైనా అర్థం చేసుకుంటావనే ఆశతో... చివరిగా ఒక్కమాట... ఇప్పుడూ...ఎప్పుడూ నీ ఉన్నతిని కోరుకునే
-- ఓ నేస్తం.

4, ఫిబ్రవరి 2012, శనివారం

నీలి నింగిలో నిండుజాబిలీ నేల దిగిరావే... నన్నేల మరిచావే

నీలి నింగిలో నిండుజాబిలీ
నేల దిగిరావే... నన్నేల మరిచావే
నువులేని నేను శిలను... మెలకువేలేని కలను
నిను వీడి నేలేను... నే ఓడి మనలేను
ప్రేమకు మరుపే తెలియదులే
మనసు ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు
జన్మజన్మకు నీతోడు
వాడనిదమ్మా నా వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నేల దిగిరావే... నన్నేల మరిచావే..
దేవుడు కనబడి వరమిస్తే వేయి జన్మలు ఇమ్మంటా...
ప్రతి ఒక జన్మా నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా...
దేవత నీవని గుడికడతా... జీవితమంతా పూజిస్తా...
నేల దిగిరావే నన్నేల మరిచావే...