Pages

30, జులై 2010, శుక్రవారం

ఆ క్షణం



ఆ క్షణం
నీ కన్నీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది
నాకోసం బాధపడే హృదయం ఒకటుందని

మరుక్షణం
నీ చిరుకోపం నాకెంతో ఊరటనిచ్చింది
నాకోసం పరితపించే మనిషొకరుందని

ప్రతీక్షణం
నీ పరామర్శ నాకెంతో స్వస్థతనిచ్చింది
నాకో మనసైన నేస్తముందని

26, జులై 2010, సోమవారం

నక్షత్రాలు లేని ఆకాశం


నక్షత్రాలు లేని ఆకాశం
సూర్యుడులేని పగలు
చంద్రుడులేని రాత్రి
పరిమళంలేని పూలు
ఇవన్నీలేని ప్రకృతిని ఊహించలేము
ఇవన్నీ వుండి నువ్వులేని జీవితాన్ని భరించలేను
నీ స్నేహం లేనిదే నేను లేను

మళ్ళీ వచ్చు సూర్యోదయం


మనసులు అలిసిన వేళ...
మౌనం దరిచేరే వేళ...
చల్లని చంద్రుని నీడలో
తీపి జ్ఞాపకాల వడిలో...
నిదురపో మిత్రమా...
నా ఆత్మీయ నేస్తమా...
మళ్ళీ వచ్చు సూర్యోదయం
ప్రభవించు మన ప్రేమాలయం

19, జులై 2010, సోమవారం

మనోగతం


ఇది నా మనోగతం...
మనసులోని భావాల మౌనగీతం
ఆమె నా కనుల ముందు తిరుగాడుతుంటే
నేను అచేతనుణ్ణవుతా
అలా చూస్తుండిపోతా
నన్ను నేను మైమరచిపోతా
తను వెళ్ళిన మరుక్షణం
జీవచ్చవాన్నవుతా
ప్రాణంలేని బొమ్మనవుతా
మకరందం కోసం పరిభ్రమించే
తుమ్మదనవుతా
నేను నేను కావడానికి
ఓ దినం పడితే...
తిరిగి తను కనిపిస్తే
కథ షరా మామూలే...

ఎన్ని జన్మలైనా నీకోసం


నేను..

కవిని కాను నేస్తం

నీ హొయలు వర్ణింపగ

రచయితనయినా కాకపోతిని

నీ ప్రతి కదలికనూ లిఖింపగ

చిత్రకారునికానేదు సుమీ

నీ నయగారాలను చిత్రింపగ

హృదయఘోషను సైతం చెప్పనైతిని

నీ సముఖంబు మూగనైతి

అయినా...

ఈ జన్మంతా నీ స్నేహం కోసం

మరుజన్మవుంటే నీ ప్రేమ కోసం

ఎన్ని జన్మలైనా నీకోసం

పరితపిస్తా క్షణం క్షణం

12, జులై 2010, సోమవారం

మరుజన్మనైనా నీ హృది గెలవాలని


తొలిచూపులోనే నన్నాకర్షించావు
నా ప్రమేయం లేకుండానే నా జీవితంతో పెనవేశావు
మోడు వారిన జీవితంలో తిరిగి ప్రేమను చిగురింప చేశావు
అంధకార జీవితంలో ఆశల హరివిల్లై విరిసావు

నాకు తెలుసు నేను పరాధీనమని
మళ్ళీ ఓ జీవితకాలం లేటయ్యానని
కాదుకూడదంటే వెర్రిమనసు వెక్కిరించింది
ఈ జీవితానికింతే అని జోకొట్టింది

అంతలోనే మాయమయ్యావు
మరొకరి సొంతమయ్యావు
సుదూరానికి తరలిపొయ్యావు
ఓ జ్నాపకంగా మిగిలావు

ఏడేళ్ళ తర్వాత మళ్ళీ కలిసావు
జ్నాపకాల దొంతరలను కదిపావు
ఊహల ఊయలలో విహరింప చేశావు
కలల కౌగిలిలో కరిగిపొయ్యావు

తొలిసారి కరచాలనమిచ్చావు
ఆ స్పర్శతో పులకరింపజేశావు
ఈ జన్మకదే చాలనుకున్నాను
మరుజన్మవరకు వేచివుంటాను

నా ఆశ నువ్వు
నా శ్వాస నువ్వు
నా మనసు నువ్వు
నా సర్వస్వం నువ్వు

నా హృదయ మందిరంలో గుడి కట్టి పూజిస్తున్నా
మరుజన్మనైనా నీ హృది గెలవాలని నీ ప్రేమ పొందాలని
ఈ జన్మకొకింత ఊరట నీ స్నేహం
ఈ బీజం కావాలి మరుజన్మకు ప్రేమవృక్షం

11, జులై 2010, ఆదివారం

నీ స్నేహం...


నీ స్నేహం...
చల్లని పిల్లతెమ్మరల్లా హాయిని గొలుపుతుంది
మరుక్షణం నిట్టూర్పుల వరదలో ముంచేస్తుంది
నడిరాతిరి నిశ్శబ్దమంత గంభీరంగా వుంటుంది
తడబడే మనసుపొరలకు బంధం వేస్తుంది
నీ సన్నిధి కనురెప్పై తోడుంటుంది
నువ్వులేని ఒంటరితనం భయపెడుతుంది
అందని ఆకాశాన్ని అందిస్తుంది
అంతలోనే దూరమై వేధిస్తుంది
నేనున్నాననే నమ్మకమిచ్చి సర్వం తానే అనిపిస్తుంది
నువ్వులేకుంటే నేనేమౌతానోనని నిర్లిప్తత ఆవరిస్తుంది
ఏదోబంధం అడ్డుగోడగా నేనున్నానంటుంది
అది తెలిసినా మరువలేని నిస్సహాయతనాది

30, జులై 2010, శుక్రవారం

ఆ క్షణం



ఆ క్షణం
నీ కన్నీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది
నాకోసం బాధపడే హృదయం ఒకటుందని

మరుక్షణం
నీ చిరుకోపం నాకెంతో ఊరటనిచ్చింది
నాకోసం పరితపించే మనిషొకరుందని

ప్రతీక్షణం
నీ పరామర్శ నాకెంతో స్వస్థతనిచ్చింది
నాకో మనసైన నేస్తముందని

26, జులై 2010, సోమవారం

నక్షత్రాలు లేని ఆకాశం


నక్షత్రాలు లేని ఆకాశం
సూర్యుడులేని పగలు
చంద్రుడులేని రాత్రి
పరిమళంలేని పూలు
ఇవన్నీలేని ప్రకృతిని ఊహించలేము
ఇవన్నీ వుండి నువ్వులేని జీవితాన్ని భరించలేను
నీ స్నేహం లేనిదే నేను లేను

మళ్ళీ వచ్చు సూర్యోదయం


మనసులు అలిసిన వేళ...
మౌనం దరిచేరే వేళ...
చల్లని చంద్రుని నీడలో
తీపి జ్ఞాపకాల వడిలో...
నిదురపో మిత్రమా...
నా ఆత్మీయ నేస్తమా...
మళ్ళీ వచ్చు సూర్యోదయం
ప్రభవించు మన ప్రేమాలయం

19, జులై 2010, సోమవారం

మనోగతం


ఇది నా మనోగతం...
మనసులోని భావాల మౌనగీతం
ఆమె నా కనుల ముందు తిరుగాడుతుంటే
నేను అచేతనుణ్ణవుతా
అలా చూస్తుండిపోతా
నన్ను నేను మైమరచిపోతా
తను వెళ్ళిన మరుక్షణం
జీవచ్చవాన్నవుతా
ప్రాణంలేని బొమ్మనవుతా
మకరందం కోసం పరిభ్రమించే
తుమ్మదనవుతా
నేను నేను కావడానికి
ఓ దినం పడితే...
తిరిగి తను కనిపిస్తే
కథ షరా మామూలే...

ఎన్ని జన్మలైనా నీకోసం


నేను..

కవిని కాను నేస్తం

నీ హొయలు వర్ణింపగ

రచయితనయినా కాకపోతిని

నీ ప్రతి కదలికనూ లిఖింపగ

చిత్రకారునికానేదు సుమీ

నీ నయగారాలను చిత్రింపగ

హృదయఘోషను సైతం చెప్పనైతిని

నీ సముఖంబు మూగనైతి

అయినా...

ఈ జన్మంతా నీ స్నేహం కోసం

మరుజన్మవుంటే నీ ప్రేమ కోసం

ఎన్ని జన్మలైనా నీకోసం

పరితపిస్తా క్షణం క్షణం

12, జులై 2010, సోమవారం

మరుజన్మనైనా నీ హృది గెలవాలని


తొలిచూపులోనే నన్నాకర్షించావు
నా ప్రమేయం లేకుండానే నా జీవితంతో పెనవేశావు
మోడు వారిన జీవితంలో తిరిగి ప్రేమను చిగురింప చేశావు
అంధకార జీవితంలో ఆశల హరివిల్లై విరిసావు

నాకు తెలుసు నేను పరాధీనమని
మళ్ళీ ఓ జీవితకాలం లేటయ్యానని
కాదుకూడదంటే వెర్రిమనసు వెక్కిరించింది
ఈ జీవితానికింతే అని జోకొట్టింది

అంతలోనే మాయమయ్యావు
మరొకరి సొంతమయ్యావు
సుదూరానికి తరలిపొయ్యావు
ఓ జ్నాపకంగా మిగిలావు

ఏడేళ్ళ తర్వాత మళ్ళీ కలిసావు
జ్నాపకాల దొంతరలను కదిపావు
ఊహల ఊయలలో విహరింప చేశావు
కలల కౌగిలిలో కరిగిపొయ్యావు

తొలిసారి కరచాలనమిచ్చావు
ఆ స్పర్శతో పులకరింపజేశావు
ఈ జన్మకదే చాలనుకున్నాను
మరుజన్మవరకు వేచివుంటాను

నా ఆశ నువ్వు
నా శ్వాస నువ్వు
నా మనసు నువ్వు
నా సర్వస్వం నువ్వు

నా హృదయ మందిరంలో గుడి కట్టి పూజిస్తున్నా
మరుజన్మనైనా నీ హృది గెలవాలని నీ ప్రేమ పొందాలని
ఈ జన్మకొకింత ఊరట నీ స్నేహం
ఈ బీజం కావాలి మరుజన్మకు ప్రేమవృక్షం

11, జులై 2010, ఆదివారం

నీ స్నేహం...


నీ స్నేహం...
చల్లని పిల్లతెమ్మరల్లా హాయిని గొలుపుతుంది
మరుక్షణం నిట్టూర్పుల వరదలో ముంచేస్తుంది
నడిరాతిరి నిశ్శబ్దమంత గంభీరంగా వుంటుంది
తడబడే మనసుపొరలకు బంధం వేస్తుంది
నీ సన్నిధి కనురెప్పై తోడుంటుంది
నువ్వులేని ఒంటరితనం భయపెడుతుంది
అందని ఆకాశాన్ని అందిస్తుంది
అంతలోనే దూరమై వేధిస్తుంది
నేనున్నాననే నమ్మకమిచ్చి సర్వం తానే అనిపిస్తుంది
నువ్వులేకుంటే నేనేమౌతానోనని నిర్లిప్తత ఆవరిస్తుంది
ఏదోబంధం అడ్డుగోడగా నేనున్నానంటుంది
అది తెలిసినా మరువలేని నిస్సహాయతనాది