Pages

26, జనవరి 2012, గురువారం

నిను చూడక కదలాడునా నా ప్రాణం

రేయింబవళ్ళూ  నీ ధ్యానం
నిలువెల్ల రగిలించె నీ మౌనం
నీ చూపు నా పాలిట సుమబాణం 
నిను చూడక కదలాడునా నా ప్రాణం

నిదురబోయిన మనసును మేల్కొలిపావు
నా జీవన గమనానికి స్ఫూర్తిగ నిలిచావు
నిదురేరాని కనులకు ఓదార్పువైనావు
వేదన మరపి ప్రశాంతిని నింపావు

కరిగిపోని స్వప్నమా...
ఆత్మీయ బంధమా..
తెలి వెన్నెల జాలువై... 
సేదదీర్చు నేస్తమా..


25, జనవరి 2012, బుధవారం

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేకదా గుండెబలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా నేస్తం...
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ

22, జనవరి 2012, ఆదివారం

ఈ తనువు రాలిపోకముందే... కనికరించవా చెలి...



నిన్ను చూసిన తర్వాతే తెలిసింది
నేను ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలంలేటని
అప్పటికే నా గమ్యం నిర్ణయమైపోయింది మరి
నిను చూసిన తొలి క్షణమే నీరూపు చెరగని ముద్ర వేసింది

కనుల ముందు నీవున్నా నా ప్రేమను తెలుపలేకున్నా..
మనసు నిండుగా ప్రేమున్నా హద్దు దాటలేకున్నా
మనః కోవెలలో నిను దేవతగా ప్రతిష్టించుకున్నా..
స్నేహమృతాన్ని పంచి నీ దరి చేరునుకున్నా
నా ప్రేమను నీ రూపంలో బ్రతికించుకోవాలనుకున్నా
నా స్నేహంలోని  ‘ప్రేమ’ను నువు గుర్తించావని తెలుసు
నీకది నచ్చలేదనీ తెలుసు...
తప్పుచేసాననిపిస్తోంది నేస్తం!
నీ జ్ఞాపకాల నీడలు నను వెక్కిరిస్తుంటే
నా ప్రేమకు సమాధి కట్టి
ఈ జన్మకింతేనని నిరీక్షిస్తా
మరుజన్మకైనా వరమిస్తావని..

అయినా...
గాలిలో దీపంలా మిణుకుమిణుకు మంటోందో కోరిక
ఈ తనువు రాలిపోకముందే
నా కనులు మూతపడకముందే
కనికరించవా చెలి...
నను నిత్యం వెంటాడే నీ కళ్ళలోకి చూస్తూ
ఆ కనుల నీడలలో నా జాడలు వెతుక్కుంటూ
హాయిగా కనుమూస్తా... మన్నించవా చెలి..

ఓడిపోతూనే వున్నా



నేను ఓడిపోతూనే వున్నా... జీవితమంతా...
తొలిచూపులోనే కనుల నిండిన నీ రూపాన్ని
తుడిచేయమని మదిని వేడుకొన్నా...
మాట వినని మనసు ముందు ఓడిపోయా

గుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను
నీకు చేరవేయోద్దని మనసును హెచ్చరించా...
నిత్యం నీ చుట్టూ పరిభ్రమించే నా మనోనేత్రం
భావాలను నువ్వు పసిగట్టినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా

ప్రతి క్షణం నిన్ను చూడాలని
నీ దరిచేరాలనే  తహతహలాడే నా కళ్ళు
నిన్నూ చూస్తూ మైమరచి నీకు దొరికిపోయినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా

నీ మనసులో నేను లేనని తెలిసి
నా మనసులోని  ప్రేమను సమాది చేయాలనుకున్నా
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని
నా కనుల ముందు ఓడిపోయా

మనసు గాయాన్ని ఒడిసిపట్టుకొని
ప్రేమభావాల్ని మోసుకొని పోదామనుకున్నా
అనుకోని నీ పలకరింపుతో మనసు గాయాన్ని మాన్పుకొన యత్నిస్తు
నీ మనసు ముందు ఓడిపోయా

నా ప్రేమను తెలుపలేక... నీ ప్రేమను పొందలేక...
మనసు నిండా నింపుకున్న నీ రూపం మసకబారక ముందే
ఏ దూర తీరాలకో చేరాలనుకున్నా
అయినా ప్రేమ ముందు  ఓడిపోయా.... ఓడిపోతూనే వున్నా...

మాటరాని మౌనమెందుకో



కనుల ముందే నీవున్నా
నిత్యం నిను చూస్తున్నా...
మన మధ్య దూరమెందుకో
మనసుకీ మనసుకీ వేదనెందుకో

ఎదురుగా నీవున్నా
మాటరాని మౌనమెందుకో
ఇరు మనసులలో ప్రేమున్నా
పైకి బింకమెందుకో

ఆనందంలో నీ అధరాలపై చిరునవ్వునై
ఆవేదనలో కన్నీరు తుడిచే నేస్తమై
నువు నడిచే దారిలో పూలపాన్పునై
నీ జ్ఞాపకాల నీడలలో ఓ నిట్టూర్పునై

ఎప్పుడూ
నా ఊహల్లో కొలువుదీరిన దేవత నీవని... నేస్తమా నీకు తెలిసేదెలా...
నా మనసులో ప్రేమమూర్తి నీవని స్నేహమా నీకు తెలిపేదెలా..

21, జనవరి 2012, శనివారం

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...


నేస్తమా...
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది
మనం విడిపోయినప్పుడు ఆగిపోయిన నిమిషాల ముల్లు
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు... మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది
ఇవే కాస్త ఓదార్పునిస్తోంది
ఎప్పటికీ  చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

నా ‘ఆత్మ’ నన్ను వీడిపోయింది...


నా ‘ఆత్మ’ నన్ను వీడిపోయింది...
కాస్త వెతికి పెట్టండి..... ప్లీజ్
ఎవరికైనా ఆ జాడ తెలిస్తే ‘ఆత్మ’లేని కట్టే
వ్యర్థమని కాస్త నచ్చచెపుతారా...
ఇరవై ఏళ్ళ... మమకారాన్ని
అవివేకంతో జారవిడుచుకున్నా...
అందుకే నా ‘ఆత్మ’ను కాస్త వెతికి పెట్టండి.. ప్లీజ్...

13, జనవరి 2012, శుక్రవారం

ఎదుట నిలిచింది చూడు...


ఎదుట నిలిచింది చూడు..

జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..
చినుకంటే చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే .. వానవీణలా!
II ఎదుట నిలిచింది చూడు..II

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో .. కాదో.. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక..
నీదో.. కాదో.. రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా
II ఎదుట నిలిచింది చూడు..II

ఏ దివిలో విరిసిన పారిజాతమో !

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..

నీ రూపమే దివ్య దీపమై 
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల 
కాంతి నింపెనే..

II ఏ దివిలో II

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

II ఏ దివిలో II

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన యేకాంతములో
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

చెలిమియే కరువై వలపే అరుదై 
చెదరిన హృదయమే శిల యై పోగా 
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి 

తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము 

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ


ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది


నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

మౌనమే నీ భాష ఓ మూగ మనసా


మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


జాబిల్లి  కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4|
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా |నువ్వక్కడ|
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం |
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం|

నిను చూడక నేనుండలేను..


నిను చూడక నేనుండలేను..
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతివింటినీ
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

నీ జతగూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం

మంటలు రేపే నెలరాజా


మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి

ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ ..

తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా

మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు

మనసులేని బ్రతుకొక నరకం

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం 
మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే ఒక బంధమై అది నిలిచేది

తరుముకొచ్చే జ్నాపకాలు... ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతుతెచ్చే అందాలు.. కూలిపోయిన శిల్పాలు
కన్ను నీదని.. వేలు నీదని... పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం

మనసులేని దేవుడూ

మనసులేని దేవుడూ 
మనిషికెందుకో మనసిచ్చేడు
మనసు మనసునే వంచన చేస్తే
కనులకెందుకో నీరిచ్చాడు

చిట్టీ.. నీతో పంచుకున్న ఆ క్షణం

చిట్టీ..!
ఈరోజు నువ్వు చాలా బాగున్నావు
చాలా ప్రశాంతంగా ముద్దుగా వున్నావు
ఆ ఆనంద క్షణాల్లో...
నాకు అందిన ఒక శుభవార్తను
నీతో పంచుకున్న ఆ క్షణం
చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను
నువ్వు అర్థం చేసుకున్నట్టున్నావు
లాలనగా మనోధైర్యాన్నిచ్చావు
నీ ధైర్య వచనాలతో  శాంతినిచ్చావు
రెండు విభిన్న ధృవాల్లాంటి వృత్తుల్లో
ఎటువైపు మొగ్గాలో నిర్ణయించుకోలేని నాకు
మార్గదర్శివయ్యావు..
ఓ నిర్ణయం తీసుకునేందుకు తోడయ్యావు
నా ఈ నూతన పథంలో
చివరికంటా తోడుంటావని
చేయూతనిస్తావని...
ఆకాంక్షిస్తున్నా..నేస్తం

చిట్టీ... బాగున్నావా!

మనసైన ప్రియతమా
కరిగిపోని స్వప్నమా
దరిచేరని వసంతమా
నా ‘చిట్టి’ నేస్తమా
బాగున్నావా!

నీకోసం...
ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తా
అప్పటికైనా కరుణిస్తావని
ప్రపంచాన్నైనా ఎదిరిస్తా
అప్పుడైనా తోడై వుంటావని

చిట్టీ...
ఊసులుచెప్పే నీ కనుకలకు కనురెప్పనై
నీ పెదవులపై దరహాసమై
నీ గానంలో పల్లవినై
నీ కవితలో భావాన్నై

ప్రతి క్షణం నీకోసం
ప్రతి నిమిషం నీకోసం
ప్రతి యుగం నీకోసం
జన్మిస్తూనే వుంటా...
ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తూనే వుంటా...

9, జనవరి 2012, సోమవారం

మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా

పలుకులో నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా 

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)

ఏమో ఏమో ఏమౌతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా
వింటున్నావా ప్రియా

గాలిలో తెల్ల కాగితంలా
నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వు రాసిన
ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

ఆధ్యంతం ఏదో అనుభూతి(2)
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భువనం కన్నా ఇది వెనుకటిది

ప్రాణంతో పుట్టింది ప్రాణంగా 
మారే మనసే లేనిది ప్రేమా

రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని కలువని వేళలలోనా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)

26, జనవరి 2012, గురువారం

నిను చూడక కదలాడునా నా ప్రాణం

రేయింబవళ్ళూ  నీ ధ్యానం
నిలువెల్ల రగిలించె నీ మౌనం
నీ చూపు నా పాలిట సుమబాణం 
నిను చూడక కదలాడునా నా ప్రాణం

నిదురబోయిన మనసును మేల్కొలిపావు
నా జీవన గమనానికి స్ఫూర్తిగ నిలిచావు
నిదురేరాని కనులకు ఓదార్పువైనావు
వేదన మరపి ప్రశాంతిని నింపావు

కరిగిపోని స్వప్నమా...
ఆత్మీయ బంధమా..
తెలి వెన్నెల జాలువై... 
సేదదీర్చు నేస్తమా..


25, జనవరి 2012, బుధవారం

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...

ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం...
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేకదా గుండెబలం తెలిసేది
దుఃఖ్ఖానికి తలవంచితె తెలివికింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైనా
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా నేస్తం...
ఎవ్వరితో ఏమాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండీ

22, జనవరి 2012, ఆదివారం

ఈ తనువు రాలిపోకముందే... కనికరించవా చెలి...



నిన్ను చూసిన తర్వాతే తెలిసింది
నేను ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలంలేటని
అప్పటికే నా గమ్యం నిర్ణయమైపోయింది మరి
నిను చూసిన తొలి క్షణమే నీరూపు చెరగని ముద్ర వేసింది

కనుల ముందు నీవున్నా నా ప్రేమను తెలుపలేకున్నా..
మనసు నిండుగా ప్రేమున్నా హద్దు దాటలేకున్నా
మనః కోవెలలో నిను దేవతగా ప్రతిష్టించుకున్నా..
స్నేహమృతాన్ని పంచి నీ దరి చేరునుకున్నా
నా ప్రేమను నీ రూపంలో బ్రతికించుకోవాలనుకున్నా
నా స్నేహంలోని  ‘ప్రేమ’ను నువు గుర్తించావని తెలుసు
నీకది నచ్చలేదనీ తెలుసు...
తప్పుచేసాననిపిస్తోంది నేస్తం!
నీ జ్ఞాపకాల నీడలు నను వెక్కిరిస్తుంటే
నా ప్రేమకు సమాధి కట్టి
ఈ జన్మకింతేనని నిరీక్షిస్తా
మరుజన్మకైనా వరమిస్తావని..

అయినా...
గాలిలో దీపంలా మిణుకుమిణుకు మంటోందో కోరిక
ఈ తనువు రాలిపోకముందే
నా కనులు మూతపడకముందే
కనికరించవా చెలి...
నను నిత్యం వెంటాడే నీ కళ్ళలోకి చూస్తూ
ఆ కనుల నీడలలో నా జాడలు వెతుక్కుంటూ
హాయిగా కనుమూస్తా... మన్నించవా చెలి..

ఓడిపోతూనే వున్నా



నేను ఓడిపోతూనే వున్నా... జీవితమంతా...
తొలిచూపులోనే కనుల నిండిన నీ రూపాన్ని
తుడిచేయమని మదిని వేడుకొన్నా...
మాట వినని మనసు ముందు ఓడిపోయా

గుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను
నీకు చేరవేయోద్దని మనసును హెచ్చరించా...
నిత్యం నీ చుట్టూ పరిభ్రమించే నా మనోనేత్రం
భావాలను నువ్వు పసిగట్టినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా

ప్రతి క్షణం నిన్ను చూడాలని
నీ దరిచేరాలనే  తహతహలాడే నా కళ్ళు
నిన్నూ చూస్తూ మైమరచి నీకు దొరికిపోయినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా

నీ మనసులో నేను లేనని తెలిసి
నా మనసులోని  ప్రేమను సమాది చేయాలనుకున్నా
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని
నా కనుల ముందు ఓడిపోయా

మనసు గాయాన్ని ఒడిసిపట్టుకొని
ప్రేమభావాల్ని మోసుకొని పోదామనుకున్నా
అనుకోని నీ పలకరింపుతో మనసు గాయాన్ని మాన్పుకొన యత్నిస్తు
నీ మనసు ముందు ఓడిపోయా

నా ప్రేమను తెలుపలేక... నీ ప్రేమను పొందలేక...
మనసు నిండా నింపుకున్న నీ రూపం మసకబారక ముందే
ఏ దూర తీరాలకో చేరాలనుకున్నా
అయినా ప్రేమ ముందు  ఓడిపోయా.... ఓడిపోతూనే వున్నా...

మాటరాని మౌనమెందుకో



కనుల ముందే నీవున్నా
నిత్యం నిను చూస్తున్నా...
మన మధ్య దూరమెందుకో
మనసుకీ మనసుకీ వేదనెందుకో

ఎదురుగా నీవున్నా
మాటరాని మౌనమెందుకో
ఇరు మనసులలో ప్రేమున్నా
పైకి బింకమెందుకో

ఆనందంలో నీ అధరాలపై చిరునవ్వునై
ఆవేదనలో కన్నీరు తుడిచే నేస్తమై
నువు నడిచే దారిలో పూలపాన్పునై
నీ జ్ఞాపకాల నీడలలో ఓ నిట్టూర్పునై

ఎప్పుడూ
నా ఊహల్లో కొలువుదీరిన దేవత నీవని... నేస్తమా నీకు తెలిసేదెలా...
నా మనసులో ప్రేమమూర్తి నీవని స్నేహమా నీకు తెలిపేదెలా..

21, జనవరి 2012, శనివారం

కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...


నేస్తమా...
నిన్నటి వరకూ  ప్రాణ స్నేహితులం
కానీ... ఈ రోజు ప్రాణమే మిగిలింది... స్నేహం కాదు
కలిసిరాని కాలం కన్నీటి సాక్షిగా...
మరపురాని మన స్నేహాన్ని గతంగా మార్చేసింది
మనం విడిపోయినప్పుడు ఆగిపోయిన నిమిషాల ముల్లు
ప్రతి క్షణం నీవులేని లోటును తెలుపుతూనే వుంది
కష్టమొచ్చినప్పుడు కన్నీటి కంటే ముందు
నేనున్నానని గుర్తుంచుకో...
మనుషులు విడిపోవచ్చు... మనసులు ఓడిపోవచ్చు...
మమతలు మాసిపోవచ్చు... మారనిది స్నేహమొక్కటే..
ఔను...నిజమే,, ఇప్పటికీ ఏం మారలేదు...  నువ్వు గుర్తొచ్చినప్పుడు
చిరుగాలి కన్నా చల్లని నీ చిరునవ్వు నను పలకరించి పోతుంది
ఎప్పటికీ వెంటాడుతూండే ఆ కళ్ళలోని మెరుపు నను తాకి వెళుతుంది
ఇవే కాస్త ఓదార్పునిస్తోంది
ఎప్పటికీ  చకోరంలా నిరీక్షించే... ఓ నేస్తం...

నా ‘ఆత్మ’ నన్ను వీడిపోయింది...


నా ‘ఆత్మ’ నన్ను వీడిపోయింది...
కాస్త వెతికి పెట్టండి..... ప్లీజ్
ఎవరికైనా ఆ జాడ తెలిస్తే ‘ఆత్మ’లేని కట్టే
వ్యర్థమని కాస్త నచ్చచెపుతారా...
ఇరవై ఏళ్ళ... మమకారాన్ని
అవివేకంతో జారవిడుచుకున్నా...
అందుకే నా ‘ఆత్మ’ను కాస్త వెతికి పెట్టండి.. ప్లీజ్...

13, జనవరి 2012, శుక్రవారం

ఎదుట నిలిచింది చూడు...


ఎదుట నిలిచింది చూడు..

జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు..
చినుకంటే చిన్నదేమో
మైమరచిపోయా మాయలో..
ప్రాణమంత మీటుతుంటే .. వానవీణలా!
II ఎదుట నిలిచింది చూడు..II

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి
కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి
అవునో .. కాదో.. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం
చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా

నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేక విసుక్కుంది నా కేక..
నీదో.. కాదో.. రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమ
వరం లాంటి శాపమేదో సొంతమైందిలా
II ఎదుట నిలిచింది చూడు..II

ఏ దివిలో విరిసిన పారిజాతమో !

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..

నీ రూపమే దివ్య దీపమై 
నీ నవ్వుల నవ్యతారలై
నా కన్నుల వెన్నెల 
కాంతి నింపెనే..

II ఏ దివిలో II

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

II ఏ దివిలో II

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన యేకాంతములో
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

చెలిమియే కరువై వలపే అరుదై 
చెదరిన హృదయమే శిల యై పోగా 
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి 

తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము 

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నా గుండె ఏనాడో చేజారిపోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన్న ఉంటూనే ఎం మాయ చేసావొ


ఈ వేళలో నీవు ఎం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను


నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము...గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పనిచేసుకోనీవు
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేది కనిపించనంటుంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది


నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనె ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావొ
అనుకుంటు ఉంటాను ప్రతి నిముషము నేను

మౌనమే నీ భాష ఓ మూగ మనసా


మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యెన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
యెందుకు వల చేవో యెందుకు వగ చేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
యెందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


జాబిల్లి  కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4|
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ
పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా |నువ్వక్కడ|
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటీ రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం |
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై |జాబిల్లి కోసం|

నిను చూడక నేనుండలేను..


నిను చూడక నేనుండలేను..
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను

ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతివింటినీ
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను

నీ జతగూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం

మంటలు రేపే నెలరాజా


మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి

ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ ..

తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా

మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు

మనసులేని బ్రతుకొక నరకం

మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం 
మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే ఒక బంధమై అది నిలిచేది

తరుముకొచ్చే జ్నాపకాలు... ఎదను గుచ్చే గులాబి ముళ్ళు
గురుతుతెచ్చే అందాలు.. కూలిపోయిన శిల్పాలు
కన్ను నీదని.. వేలు నీదని... పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం

మనసులేని దేవుడూ

మనసులేని దేవుడూ 
మనిషికెందుకో మనసిచ్చేడు
మనసు మనసునే వంచన చేస్తే
కనులకెందుకో నీరిచ్చాడు

చిట్టీ.. నీతో పంచుకున్న ఆ క్షణం

చిట్టీ..!
ఈరోజు నువ్వు చాలా బాగున్నావు
చాలా ప్రశాంతంగా ముద్దుగా వున్నావు
ఆ ఆనంద క్షణాల్లో...
నాకు అందిన ఒక శుభవార్తను
నీతో పంచుకున్న ఆ క్షణం
చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను
నువ్వు అర్థం చేసుకున్నట్టున్నావు
లాలనగా మనోధైర్యాన్నిచ్చావు
నీ ధైర్య వచనాలతో  శాంతినిచ్చావు
రెండు విభిన్న ధృవాల్లాంటి వృత్తుల్లో
ఎటువైపు మొగ్గాలో నిర్ణయించుకోలేని నాకు
మార్గదర్శివయ్యావు..
ఓ నిర్ణయం తీసుకునేందుకు తోడయ్యావు
నా ఈ నూతన పథంలో
చివరికంటా తోడుంటావని
చేయూతనిస్తావని...
ఆకాంక్షిస్తున్నా..నేస్తం

చిట్టీ... బాగున్నావా!

మనసైన ప్రియతమా
కరిగిపోని స్వప్నమా
దరిచేరని వసంతమా
నా ‘చిట్టి’ నేస్తమా
బాగున్నావా!

నీకోసం...
ఎన్ని యుగాలైనా నిరీక్షిస్తా
అప్పటికైనా కరుణిస్తావని
ప్రపంచాన్నైనా ఎదిరిస్తా
అప్పుడైనా తోడై వుంటావని

చిట్టీ...
ఊసులుచెప్పే నీ కనుకలకు కనురెప్పనై
నీ పెదవులపై దరహాసమై
నీ గానంలో పల్లవినై
నీ కవితలో భావాన్నై

ప్రతి క్షణం నీకోసం
ప్రతి నిమిషం నీకోసం
ప్రతి యుగం నీకోసం
జన్మిస్తూనే వుంటా...
ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తూనే వుంటా...

9, జనవరి 2012, సోమవారం

మౌనముతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా

పలుకులో నీ పేరే తలచుకున్నా
పెదవుల అంచుల్లో అనుచుకున్నా
మౌనముతో నీ మదిని బంధించా
మన్నించు ప్రియా 

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)

ఏమో ఏమో ఏమౌతుందో
ఏదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా
వింటున్నావా ప్రియా

గాలిలో తెల్ల కాగితంలా
నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వు రాసిన
ఆ పాటలనే వింటున్నా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

ఆధ్యంతం ఏదో అనుభూతి(2)
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భువనం కన్నా ఇది వెనుకటిది

ప్రాణంతో పుట్టింది ప్రాణంగా 
మారే మనసే లేనిది ప్రేమా

రా ఇలా కౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీలో నెనై నిన్నే దారి చేసుకుంటా
ఎవరీ కలువని చోటులలోనా
ఎవరిని కలువని వేళలలోనా

తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా 
వింటున్నావా వింటున్నావా

విన్నా వేవేల వీణల సంతోషల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాతల్లో పులకింతల పదనిసలు విన్నా

చాలు చాలే చెలియా చెలియా 
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా(2)