నాతో మాట్లాడకుండా వుండడమే నీకు సంతోషమైతే... అలాగే కానీ...
కానీ... అది నాకెంత నరకతుల్యమో బహుశా నీకు తెలుసనే అనుకుంటున్నా...
అయినా... తప్పేమిటో చెప్పకుండా శిక్ష విధించడం భావ్యమా..
నాకున్న ఒకే ఒక నేస్తం నువ్వు... నువ్వే నాపై యుద్ధం ప్రకటిస్తే నేనెవరికి చెప్పకోను...
దాదాపు 20రోజులుగా మౌనంగా వుంటే ఏమిటో అనుకున్నాను.
ఇవాళే తెలిసింది... నలుగురితో సమంగా నన్నూ జమకట్టావు...
అదిమాత్రం భరించలేకుండా వున్నా...
ఒకవేళ నా తప్పేదైనా వుంటే...నువ్వీ తప్పు చేశావని చెప్పి
నన్ను తిట్టినా అంత బాధపడేవాడిని కాదు...
నువ్వు రాసిందానికి ఒక్కమాటలోనే రాద్దామనుకున్నా... కానీ కొంచెం ఎక్కువగానే రాసేసాను. ఈ ఒక్కసారికి విసుక్కోకుండా చదువుకో.. ఎందుకంటే... నీ అంత బాగా నేను మాట్లాడలేను... చెప్పలేను...రాయలేను. ఇకపోతే ‘అంతగా పెంచుకుంటే ఇలాగే అవుతుంది’..అంటున్నావు. అప్పుడు నాకా విషయం తెలియదు. మన మధ్య ఎప్పటికీ గొడవ రాదని ఎన్నోసార్లు అన్నావు. నీకు గుర్తులేదేమో... నా దురదృష్టం కాకపోతే ఏమిటి... 26వ తేదీన సరదాగా అన్నాను.. ‘కటీఫ్’ అని. నీకు గుర్తుండే వుంటుంది. పెద్దోళ్ళు అంటుంటారు కదా తథాస్తు దేవతలుంటారని. నేను ‘కటీఫ్’ అన్నప్పుడు ఎవరో ‘తథాస్తు’ అనివుంటారేమో..(నమ్మకాలగురించి కాసేపు పక్కనపెడదాం). కాని కొన్ని జీవితాలంతే.. ఎప్పుడూ ఏదోకటి పోగొట్టుకుంటూనే వుంటాయి. నేనూ అంతే... ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను బాధపెట్టే సంఘటన ఏదో జరిగిందని మాత్రం నీ మాటలను బట్టి అర్థమౌతోంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నావల్ల ఏదైనా ఇబ్బంది కలిగినా, తెలిసో తెలియకో నీ మనసు నొప్పించినా నన్ను క్షమించు. ఒక్కటి మాత్రం నిజం... నా వ్యక్తిగత విషయాలను కూడా మనస్సు విప్పి చెప్పుకోగలిగిన ఒకే ఒక ఆత్మబంధువు నువ్వు. ఆ విషయం నీకూ తెలుసు. అయినా... ఎంతకాలం బతుకుతాడో తెలియని వ్యక్తితో గొడవెందుకు...చెప్పు...అలాగని భరించాలనీ లేదులే... ఇకపోతే, రిటైర్ అయ్యి మా ఊరు వెళ్ళిపోయే రోజున నీకో ఫ్లాష్ బ్యాక్ చెప్పాలని ఎప్పుడూ అనుకునేవాడ్ని. ఇప్పుడదీ ప్రశ్రార్థకమే... అలాంటి రోజంటూ వస్తే కదా... ఇకముందెప్పుడూ నిన్ను డిస్ట్రబ్ చెయ్యను. ఇక సెలవు... మిత్రమా..సెలవు. . ఈ వాక్యం రాయాలంటే మనసు పిండేసినట్టుంది. ఎప్పటికైనా అర్థం చేసుకుంటావనే ఆశతో... చివరిగా ఒక్కమాట... ఇప్పుడూ...ఎప్పుడూ నీ ఉన్నతిని కోరుకునే
-- ఓ నేస్తం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి