
ఇది నా మనోగతం...
మనసులోని భావాల మౌనగీతం
ఆమె నా కనుల ముందు తిరుగాడుతుంటే
నేను అచేతనుణ్ణవుతా
అలా చూస్తుండిపోతా
నన్ను నేను మైమరచిపోతా
తను వెళ్ళిన మరుక్షణం
జీవచ్చవాన్నవుతా
ప్రాణంలేని బొమ్మనవుతా
మకరందం కోసం పరిభ్రమించే
తుమ్మదనవుతా
నేను నేను కావడానికి
ఓ దినం పడితే...
తిరిగి తను కనిపిస్తే
కథ షరా మామూలే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి