Pages

22, జనవరి 2012, ఆదివారం

ఈ తనువు రాలిపోకముందే... కనికరించవా చెలి...

నిన్ను చూసిన తర్వాతే తెలిసింది
నేను ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలంలేటని
అప్పటికే నా గమ్యం నిర్ణయమైపోయింది మరి
నిను చూసిన తొలి క్షణమే నీరూపు చెరగని ముద్ర వేసింది

కనుల ముందు నీవున్నా నా ప్రేమను తెలుపలేకున్నా..
మనసు నిండుగా ప్రేమున్నా హద్దు దాటలేకున్నా
మనః కోవెలలో నిను దేవతగా ప్రతిష్టించుకున్నా..
స్నేహమృతాన్ని పంచి నీ దరి చేరునుకున్నా
నా ప్రేమను నీ రూపంలో బ్రతికించుకోవాలనుకున్నా
నా స్నేహంలోని  ‘ప్రేమ’ను నువు గుర్తించావని తెలుసు
నీకది నచ్చలేదనీ తెలుసు...
తప్పుచేసాననిపిస్తోంది నేస్తం!
నీ జ్ఞాపకాల నీడలు నను వెక్కిరిస్తుంటే
నా ప్రేమకు సమాధి కట్టి
ఈ జన్మకింతేనని నిరీక్షిస్తా
మరుజన్మకైనా వరమిస్తావని..

అయినా...
గాలిలో దీపంలా మిణుకుమిణుకు మంటోందో కోరిక
ఈ తనువు రాలిపోకముందే
నా కనులు మూతపడకముందే
కనికరించవా చెలి...
నను నిత్యం వెంటాడే నీ కళ్ళలోకి చూస్తూ
ఆ కనుల నీడలలో నా జాడలు వెతుక్కుంటూ
హాయిగా కనుమూస్తా... మన్నించవా చెలి..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి