
నీ స్నేహం...
చల్లని పిల్లతెమ్మరల్లా హాయిని గొలుపుతుంది
మరుక్షణం నిట్టూర్పుల వరదలో ముంచేస్తుంది
నడిరాతిరి నిశ్శబ్దమంత గంభీరంగా వుంటుంది
తడబడే మనసుపొరలకు బంధం వేస్తుంది
నీ సన్నిధి కనురెప్పై తోడుంటుంది
నువ్వులేని ఒంటరితనం భయపెడుతుంది
అందని ఆకాశాన్ని అందిస్తుంది
అంతలోనే దూరమై వేధిస్తుంది
నేనున్నాననే నమ్మకమిచ్చి సర్వం తానే అనిపిస్తుంది
నువ్వులేకుంటే నేనేమౌతానోనని నిర్లిప్తత ఆవరిస్తుంది
ఏదోబంధం అడ్డుగోడగా నేనున్నానంటుంది
అది తెలిసినా మరువలేని నిస్సహాయతనాది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి