
ఆ క్షణం
నీ కన్నీరు నాకెంతో ధైర్యాన్నిచ్చింది
నాకోసం బాధపడే హృదయం ఒకటుందని
మరుక్షణం
నీ చిరుకోపం నాకెంతో ఊరటనిచ్చింది
నాకోసం పరితపించే మనిషొకరుందని
ప్రతీక్షణం
నీ పరామర్శ నాకెంతో స్వస్థతనిచ్చింది
నాకో మనసైన నేస్తముందని
నేను..
కవిని కాను నేస్తం
నీ హొయలు వర్ణింపగ
రచయితనయినా కాకపోతిని
నీ ప్రతి కదలికనూ లిఖింపగ
చిత్రకారునికానేదు సుమీ
నీ నయగారాలను చిత్రింపగ
హృదయఘోషను సైతం చెప్పనైతిని
నీ సముఖంబు మూగనైతి
అయినా...
ఈ జన్మంతా నీ స్నేహం కోసం
మరుజన్మవుంటే నీ ప్రేమ కోసం
ఎన్ని జన్మలైనా నీకోసం
పరితపిస్తా క్షణం క్షణంనేను..
కవిని కాను నేస్తం
నీ హొయలు వర్ణింపగ
రచయితనయినా కాకపోతిని
నీ ప్రతి కదలికనూ లిఖింపగ
చిత్రకారునికానేదు సుమీ
నీ నయగారాలను చిత్రింపగ
హృదయఘోషను సైతం చెప్పనైతిని
నీ సముఖంబు మూగనైతి
అయినా...
ఈ జన్మంతా నీ స్నేహం కోసం
మరుజన్మవుంటే నీ ప్రేమ కోసం
ఎన్ని జన్మలైనా నీకోసం
పరితపిస్తా క్షణం క్షణం