
వెన్నెల విరహం రేపుతున్న వేళ...
మెరిసేటి ఓ మేఘమాల...
వెన్నెల వర్షంలో తడిసి
పారిజాత పరిమళాలు వెదజల్లి
మల్లెల మకరంధంతో మరులుగొలిపి
వసంతంలా వచ్చి గ్రీష్మతాపం రేపి
శరత్కాల వెన్నెలలా హృదయవీణ మీటి
ఓ క్షణం నీ ముద్దుల ఝడిలో ఓలలాడించి
తరలిపోయిన ఓ నీలిమేఘమా...
విన్నవించు నా చెలికి...
విన్నవేదన.... నా హృదయారాదన...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి