24, జనవరి 2011, సోమవారం
నీ మౌనం నన్ను వేధిస్తోంది...
ప్రియమైన నేస్తమా...!
ఇది కవిత కాదు... నా భవిత
నీముందు పరచిన నా మూగవేధన
నీతో మాట్లాడలని... ఎన్నెన్నో ఊసులు చెప్పాలని...
నా మనసులోని భావాలను పంచుకోవాలని...
ఒకటే తహతహ...
కానీ...
నీ సమక్షంలో... నాకు దొరికే కొద్ది సమయంలో...
ఏమని చెప్పను? ఎన్నని చెప్పను?.... అసలెక్కడ మొదలెట్టను?
నీ అంత బాగా నేను మాట్లాడలేనని నాకు తెలుసు.
నీ అంత సూటిగానూ చెప్పలేనని నాకు తెలుసు.
నీకులా నేను రచనలు చేయలేను... కవితలు రాయలేను...
అతి మామూలు భాషలో... నాకు తెలిసిన కొద్దిపదాలతో
నీ సమక్షంలో నా జ్ఞాపకాలను పోగుచేసుకొని
నీకు అభిషేకం చేయాలని... పిచ్చి తలపులను
పక్కకునెట్టి ఓసారి పరికించి చూస్తే..
అంతా మౌనం...
తుఫానుముందు నిశ్శబ్ధంలా...
నీ మౌనం నన్ను వేధిస్తోంది
నేను చేసిన తప్పేంటో నాకు తెలియకుంది
నాకు తెలిసి ఒక్క ఎస్సెమ్మెస్ ఇంత పనిచేస్తుందనుకోలేదు
దానిపై పడకూడని కళ్ళు పడతాయని తెలియదు
అంతే నేస్తం...
అంతకుమించి నేను చేసిన తప్పేంటి?
అందుకు నీ మౌనంతో నన్ను శిక్షిస్తావా?
అదెంత వేధనా భరితమో నీకు తెలియదా?
అయినా ఫర్వాలేదు నేస్తం నేను భరిస్తాను
నా స్నేహం నీకు కష్టం కలిగించిననాడు
నా ప్రేమ నీకు నష్టం కలిగించిననాడు
నేను నీకు కనిపించను నేస్తం....
మరెప్పటికీ కలువను నేస్తం...
నీమీద ప్రేమ గుండెల నిండా వుంది
నీమీద ఆరాధన మనసు నిండావుంది
నీకళ్ళు నను వెంటాడుతూనే వుంటాయి
ఈ జన్మకీ జ్ఞాపకాలు చాలు నేస్తం...
మరు జన్మవరకూ బతికేస్తా...
ఈ వ్యధనంతా నీముందు చెప్పలేను
ఆ కళ్ళు నాకు బంధం వేస్తాయి
నను తన బంధీగా చేసుకుంటాయి
అందుకే బంగారం...
నీతో మాట్లాడాలని ఫొన్ చేతిలోకి తీసుకుంటే చెయ్యి వణుకుతోంది ఎందుకనో?
నీ నంబరు డయలు చేయబోతే తెలియని ఆతృత ఎందుకో?
నీకు చెప్పటంలో కన్నా, దాచుకోవడంలోనే ఆనందముందేమో!
నీకు చెప్పాల్సిందే ఎప్పటికైనా... కానీ... కానీ.. ఫొన్ లో కాదు.
మరెలా...
ఎప్పుడు... ఎప్పుడోకప్పుడు నీకు చెప్పాల్సిందే....
లేకపోతే... ఈ చిన్నిగుండె బద్దలవుతుందేమో...
అందుకే ధైర్యం చేసా... ఓ కథగా రాయాలని
మరుక్షణం...
కంప్యూటర్ స్క్రీన్ పై అందమైన అక్షర దొంతరలు
మదిలో కదిలే అనుభూతుల అక్షరమాలలు
అన్నట్టు-
నువ్వు గుర్తొస్తే , నా పక్కన ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప
నువ్వు పక్కనుంటే, నేనంటూ లేనేలేను నువ్వు తప్ప!
మరి ఏమంటావు నేస్తం ఈ అనుభూతిని?
ఒంటరితనంలో నిన్నటి మన స్నేహం గుర్తొస్తుంది
నీ సమక్షంలో మనసు మూగబోతుందెందుకో...
జీవిత సమరంలో నన్ను నేను కోల్పోయాను.
అలా కోల్పోయిన “నన్ను” నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నంలో
కొన్ని పొరబాట్లు జరిగివుండొచ్చు..
అవి కావాలని చేసినవి మాత్రం కాదు..
అది నువ్వు నమ్మతే చాలు..
నా విజయాలు నీ మెప్పు పొందాలని
నీ చిరునవ్వులో చూసుకోవాలననే పేరాశ
కానీ...
నిన్నెలా కోరను నేస్తం... ఈ వరాన్నివ్వమని?
నీకెలా వినిపించను నేస్తం... మనసు పలికే మౌనగీతాన్ని?
నిన్ను చూసిన క్షణం నుంచి మరెప్పుడూ గుర్తు చేసుకునే ప్రయత్నమే చెయ్యలేదు
అసలు మర్చిపోతే కదా, గుర్తు చేసుకోవడానికి.
నీ జ్ఞాపకం నాకు తోడుగా లేనిది ఎప్పుడని?
నీ కనులు చెప్పే ఊసులు నను వెంటాడనిదెప్పుడని?
అందుకే,
నా కలల కూర్పుగా, నీ జ్ఞాపకాల సాక్షిగా,
ఇంతసేపూ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా....
నా అనుభూతిలోని గాఢత నీకు తెలీకపోతే;
నా ప్రేమలో నిజాయితీ లోపించినట్లే...
21, జనవరి 2011, శుక్రవారం
ఓ మేఘమాల
ఆకాశవీధిలో పయనించే ఓ మేఘమాల
నా ప్రియసఖి ఏడబోయెనో చెప్పవేల
జాడ తెలుసుకొని పోయిరావా
జాబు తీసుకొని వేగిరం రావా
గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు వెళ్ళెనేమో చూసి వస్తున్నావా
చెలి మాటేదైనా చెప్పెనేమో
మనసు నిండుగా చెప్పి పోవా
మనసు తెలిసిన ఓ మేఘమాలా
చెలిని మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
చెలి రూపే నిలిచెనే నా చెంత చెలి మాటే పిలిచెనే
మమతలెరిగిన ఓ మేఘమాలా
చెలి కోసం దిగులుతో రేపవలు
ఎదురుతెన్నులు చూచెనే కళ్ళు కాయలు కాచెనే
చెలి కాన్పించునేమో నను కరుణించునేమో
జాలిగుండెల ఓ మేఘమాలా
చెలిని చూడక భరింపజాలా
గుండెలో గూడుకట్టిన వేదనంతా
వానజల్లై కురిసిరావా చెలి పాదాలచెంత
ఏడబోయావు ఓ జాబిలమ్మా
ఏడబోయావు ఓ జాబిలమ్మా
ఏ మబ్బుల్లో దాగావు నా జాబిలమ్మా
ఎక్కడని వెతకను ఓ జాబిలమ్మా
ఏ తారల నడుమ నీవున్నవో నా జాబిలమ్మా
జాడతెమ్మని ఆకశమ్మను వేడుకున్నా ఓ జాబిలమ్మా
ఏ నీలిమబ్బులు కమ్మెనో తెలుపమని
మేఘమాలను ప్రాధేయపడ్డా నా జాబిలమ్మా
ఈ మూగ వీణ శృతి చేసినావే ఓ జాబిలమ్మా
నా మానసవీణ పలికించినావే నా జాబిలమ్మా
సుధామధురం చవి చూపినావే ఓ జాబిలమ్మా
సదా మాసిపోని స్మృతి నాకు నీవే... నా జాబిలమ్మా
జాబిల్లి కోసం ఆకాశమల్లే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక రాసాను నేను నావ్యధనంతా
మేఘాలతోటీ నా నివేదనా లేఖగా నీకంపినాను రావా దేవీ
నీ పేరొక జపమైనది
నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
16, జనవరి 2011, ఆదివారం
ఓ నీలిమేఘమా...
వెన్నెల విరహం రేపుతున్న వేళ...
మెరిసేటి ఓ మేఘమాల...
వెన్నెల వర్షంలో తడిసి
పారిజాత పరిమళాలు వెదజల్లి
మల్లెల మకరంధంతో మరులుగొలిపి
వసంతంలా వచ్చి గ్రీష్మతాపం రేపి
శరత్కాల వెన్నెలలా హృదయవీణ మీటి
ఓ క్షణం నీ ముద్దుల ఝడిలో ఓలలాడించి
తరలిపోయిన ఓ నీలిమేఘమా...
విన్నవించు నా చెలికి...
విన్నవేదన.... నా హృదయారాదన...
14, జనవరి 2011, శుక్రవారం
అందుకే నువ్వు నాకు నచ్చావ్
నువ్వు నాకు నచ్చావ్...
ఎందుకంటే ఏం చెప్పను?
చెప్పేందుకు మాటలులేవని ఎలాచెప్పను?
పువ్వు ఎందుకు పరిమళిస్తుందంటే ఏం చెప్పను?
వెన్నెల ఎందుకు విరబూస్తుందంటే ఎలా చెప్పను?
నీరు ఎందుకు పారుతుందో... గాలి ఎందుకు వీస్తుందో... చెప్పమంటే
చెప్పేందుకు మాటలులేవని
నా హృదయమంతా నువ్వే నిండియున్నావని ఎలాచెప్పను?
అందుకే నా హృదయం ప్రేమిస్తుంది..
దానికి నువ్వు నచ్చావ్ గనుక...
ఆ విషయం నీకూ తెలుసు...
నా కళ్ళలోని భావాల్ని గుర్తించలేనంత
అమాయకురాలివి కావని నాకూ తెలుసు...
కానీ ఆ ప్చిచ్చి హృదయానికేం తెలుసు
నీచూపుల్లో మైకం.... నీ మాటల్లో మధురం...
అందుకే నువ్వు నాకు నచ్చావ్...
2, జనవరి 2011, ఆదివారం
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ ||ఈ వేళలో||
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది
నువు కాక వేరేది కనిపించనంటొంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తొచనీకుంది
నీ మీద ఆశేదొ నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటె నువు.....నవ్వుకుంటావు ||ఈ వేళలో||
(గులాబి సినిమాలో పాట)
నను వలచావని తెలిసేలోపే నివురైపోతాను...
నిన్ను మరచిపోవాలనీ
నీవైపు చూడకుండనే వుండాలనీ
ఎన్నిసార్లో అనుకున్నాకున్నా...
అది సాధ్యపడక మిన్నకున్నా...
నా హృదయంలో కొలువైన నీ రూపం
కనుల ఎదుట కనుమరుగవుతుంటే...
కలనైన నీ ఎడబాటునూహించని నా హృదయం
మంచు పెళ్ళలుగా విరిగిపడుతుంటే...
నా అపరాధమేమిటో తెలుపని నీ మౌనం
నిలువునా నను దహించివేస్తుంటే...
నేను చేయగల సాయం ఒక్కటే
నిను మరచిపోవడం..
నీకిచ్చే అభయమొక్కటే
నీ స్మృతులను చెరపివేయడం...
అది నావల్లకాదని నీకూ తెలుసు
ప్రయత్నిస్తా నేస్తమా...
నిను వీడిపోతా ప్రియతమా..
నీ జ్ఞాపకాల నీడలలో
నన్నెపుడో చూస్తావు..
మనసు పొరల తడిలో
మంచు బిందువులా అగుపిస్తాను...
నీ గుండె గదులలో
దాగిన ప్రేమను వెలిగిస్తావు...
నను వలచావని తెలిసేలోపే
నివురైపోతాను...
చకోరంలా నిరీక్షిస్తా నీకోసం
నీ అనుభూతుల జాడలో
మైమరచిపోయా నీ మాయలో
కనులలోని నీ రూపం కనుమరుగవుతుందేమోనని
అలసిన నా కళ్ళనడుగు నిద్రలేని రాత్రులెన్నో
నువ్వంటే అంతిష్టం ఎందుకో నాకు
సమాధానం లేని ప్రశ్నే అని తెలుసు నీకు
నీ చిరు దరహాసం మళ్ళీ మళ్ళీ చూడాలని
వసంతంకై ఎదురుచూసే కోయిలనై
నీ పిలుపుకై పరితపించే తపస్వినై
నీ మనసు తలుపు తట్టి
నీ అధరాలు ఒడిసిపట్టి
చిరుగాలి స్పర్శలా నిను స్పృశిస్తా
ఆకర్షణ అని తోసివేస్తావో
ఆరాధన అని లాలిస్తావో...
చెలివో శిలవో తెలియకుంది నీ మౌనం
చెలిమి బంధమల్లుకుంది నా ధ్యానం
సర్వ జగత్తు నిదురమత్తులో సోలిపోయే వేళ
చకోరంలా నిరీక్షిస్తా నీకోసం
నా ప్రాణమా నను వీడి పోకుమా...
నా ప్రాణమా నను వీడి పోకుమా... నీ ప్రేమ లో నను కరగనీకుమా...
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనితా .. అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన....!
నా ప్రాణమా నను వీడి పోకుమా , నీ ప్రేమ లో నను కరగనీకుమా ..
నమ్మవుగ చెలియా నే నిజమే చెబుతున్న,నీ ప్రేమ అనే పంజరాన చికుకుని పడిఉన్న,
కలలో కూడా నీ రూపం నన్ను కలవర పరిచేన, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే ..
నువోకచోట ... నేనోకచోట .. నిను చూడకుండా నే క్షనముండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నాగుండెకు గాయం చేయకే ..
అనిత ఓ వనిత .... నా అందమైన అనిత .. దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ...
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా ....!!
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతిక్షణము ధ్యానిస్తూ పసి పాపల చుస్తాన్న,
విసుగురాని నా హృదయం నీ పిలుపుకే ఎదురు చుస్తోంది ,
నిను పొందని ఈ జన్మే నా కేందుకని అంటుంది
కరునిస్తావో లేక , నను కాదని అంటావో , నా కమ్మని కళలు కూల్చి నను ఒంటరి వాడ్ని చేయకే,
అనిత .. అనితా ..అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..
దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన..!!!
ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఓ చిన్న ఆశ, నాలో చచెంత ప్రేమ మదిలో ,
ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న........ ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న ,
వొట్టేసి చెపుతున్న, నా ఊపిరి ఆగువరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ......
అనిత .. అనితా ..అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..
దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన....!