Pages

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

నీ ఆరాధకుడను....


ప్రేమంటే...
కోరుకోవడం
అభిమానించడం
పూజించడం,,,,,

స్నేహంటే..
ఎదుటివారి ఇష్టాన్ని తనిష్టంగా మార్చుకోవడం
ఎలాంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం

మరి ఆరాధించడమంటే....
ప్రేమ...
స్నేహం...
ఆ రెండూ పాలు... పంచదారలా కలిస్తే...
ప్రేమికుడివా... స్నేహితుడివా... అని నువ్వడిగితే

ఖచ్చితంగా నేను నీ ఆరాధకుడను....
నిన్ను గుడ్డిగా ఆరాధించే  ఆస్వాదకుడను
అనురక్తుడను నీ ప్రియ భక్తుడను

ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు

నేస్తం ఎంత నిశ్శబ్దంగా
నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెళ్ళావు
వెళ్తూ వెళ్తూ బోలెడు వసంతాన్ని
బతుకంతా వర్షించి వెళ్ళావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాల పూదోటలో
ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు
ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో పదిలపర్చావు
నిజానికవి జ్ఞాపకాలు కావు... ఓ ప్రవాహం
ప్రవాహాన్ని దాచుకోవడం ఎలా సాధ్యం....
అందుకే నేస్తం
ఆ జ్ఞాపకాల ప్రవాహం..
ఆ  అక్షర ఝరి.. చేస్తోంది నీకు అభిషేకం...


కనులనొదలిపోయే చూపులతో కనులారా ‘తనని’ చూడాలి

నిన్నలన్నీ తెలిసిన సమయమా...
కదలక నిలిచిపోవా కాసేపు...
కనులనొదలిపోయే చూపులతో
కనులారా ‘తనని’ చూడాలి
మనసారా మాట్లాడాలి
సంపూర్ణమైంది నా జీవితం
ఆకాశమంత ఆనందంతో..

’’ ‘రుషి‘ సినిమా చివరలో వచ్చే
ఈ నాలుగు మాటలు నన్నెంతో కదిలించాయి....’’

15, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్ఞాపకాల హారతి నువ్వు

గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
వెలుగులు నింపుతూనే వుంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను పంపించలేను
మది అంధకారం చేసుకోలేను
అలాగని... జీవితానికి నిన్ను అభిషేకించనూలేను
ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు
మది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో  నా ఆత్మీయ నేస్తమా….. నిన్ను
గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో...

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం


జాబిలి కన్న నా చెలి మిన్న
పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను

-- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...  నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం

19, ఫిబ్రవరి 2012, ఆదివారం

నీ ఆరాధకుడను....


ప్రేమంటే...
కోరుకోవడం
అభిమానించడం
పూజించడం,,,,,

స్నేహంటే..
ఎదుటివారి ఇష్టాన్ని తనిష్టంగా మార్చుకోవడం
ఎలాంటి త్యాగానికైనా వెనుదీయకపోవడం

మరి ఆరాధించడమంటే....
ప్రేమ...
స్నేహం...
ఆ రెండూ పాలు... పంచదారలా కలిస్తే...
ప్రేమికుడివా... స్నేహితుడివా... అని నువ్వడిగితే

ఖచ్చితంగా నేను నీ ఆరాధకుడను....
నిన్ను గుడ్డిగా ఆరాధించే  ఆస్వాదకుడను
అనురక్తుడను నీ ప్రియ భక్తుడను

ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు

నేస్తం ఎంత నిశ్శబ్దంగా
నా జీవితంలోకి వచ్చావో
అంతే నిశ్శబ్దంగా వెళ్ళావు
వెళ్తూ వెళ్తూ బోలెడు వసంతాన్ని
బతుకంతా వర్షించి వెళ్ళావు
నీవు మిగిల్చిన జ్ఞాపకాల పూదోటలో
ప్రతి జ్ఞాపకం ఓ మొక్కై పూసినట్టు,,. పూసి రాలినట్టు
ఎన్నో జ్ఞాపకాలు గుండెల్లో పదిలపర్చావు
నిజానికవి జ్ఞాపకాలు కావు... ఓ ప్రవాహం
ప్రవాహాన్ని దాచుకోవడం ఎలా సాధ్యం....
అందుకే నేస్తం
ఆ జ్ఞాపకాల ప్రవాహం..
ఆ  అక్షర ఝరి.. చేస్తోంది నీకు అభిషేకం...


కనులనొదలిపోయే చూపులతో కనులారా ‘తనని’ చూడాలి

నిన్నలన్నీ తెలిసిన సమయమా...
కదలక నిలిచిపోవా కాసేపు...
కనులనొదలిపోయే చూపులతో
కనులారా ‘తనని’ చూడాలి
మనసారా మాట్లాడాలి
సంపూర్ణమైంది నా జీవితం
ఆకాశమంత ఆనందంతో..

’’ ‘రుషి‘ సినిమా చివరలో వచ్చే
ఈ నాలుగు మాటలు నన్నెంతో కదిలించాయి....’’

15, ఫిబ్రవరి 2012, బుధవారం

జ్ఞాపకాల హారతి నువ్వు

గుండె గదిలో ఏ మూలో తచ్చాడుతూనే ఉంటావు
వెలుగులు నింపుతూనే వుంటావు
మనసు తలుపులు తెరిచి నిన్ను పంపించలేను
మది అంధకారం చేసుకోలేను
అలాగని... జీవితానికి నిన్ను అభిషేకించనూలేను
ఏకాంతంలో నిన్ను తలచి మైమరచిపోతుంటాను
నీతో ముచ్చట్లు చెపుతూంటాను
నాలో ఎప్పటికీ ఆరని జ్యోతివి నువ్వు
మది నిండిన జ్ఞాపకాల హారతి నువ్వు
అందుకేనేమో  నా ఆత్మీయ నేస్తమా….. నిన్ను
గుండె గదిలో ఓ మూల బంధించాను!
నువ్వెప్పటికీ నాలోనే వుంటావుకదా... అప్పుడు
ప్రేమజ్యోతివై వెలుగులు నింపుతావో
ఆరని అగ్నికీలవై మదిని దహిస్తావో...

14, ఫిబ్రవరి 2012, మంగళవారం

నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం


జాబిలి కన్న నా చెలి మిన్న
పులకింతలకే పూచిన పొన్నా
కానుకలేమి నేనివ్వగలను
కన్నుల కాటుక నేనవ్వగలను

-- ప్రేమికుల దినోత్సవం సందర్భంగా...  నా ‘ఆత్మీయ’ నేస్తానికి అంకితం