నేను ఓడిపోతూనే వున్నా... జీవితమంతా...
తొలిచూపులోనే కనుల నిండిన నీ రూపాన్ని
తుడిచేయమని మదిని వేడుకొన్నా...
మాట వినని మనసు ముందు ఓడిపోయా
గుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను
నీకు చేరవేయోద్దని మనసును హెచ్చరించా...
నిత్యం నీ చుట్టూ పరిభ్రమించే నా మనోనేత్రం
భావాలను నువ్వు పసిగట్టినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా
ప్రతి క్షణం నిన్ను చూడాలని
నీ దరిచేరాలనే తహతహలాడే నా కళ్ళు
నిన్నూ చూస్తూ మైమరచి నీకు దొరికిపోయినప్పుడు
మాట వినని నా మనస్సు ముందు ఓడిపోయా
నీ మనసులో నేను లేనని తెలిసి
నా మనసులోని ప్రేమను సమాది చేయాలనుకున్నా
గుండెపగిలి చిందుతున్న కన్నీటిని ఆపుకోలేని
నా కనుల ముందు ఓడిపోయా
మనసు గాయాన్ని ఒడిసిపట్టుకొని
ప్రేమభావాల్ని మోసుకొని పోదామనుకున్నా
అనుకోని నీ పలకరింపుతో మనసు గాయాన్ని మాన్పుకొన యత్నిస్తు
నీ మనసు ముందు ఓడిపోయా
నా ప్రేమను తెలుపలేక... నీ ప్రేమను పొందలేక...
మనసు నిండా నింపుకున్న నీ రూపం మసకబారక ముందే
ఏ దూర తీరాలకో చేరాలనుకున్నా
అయినా ప్రేమ ముందు ఓడిపోయా.... ఓడిపోతూనే వున్నా...