
ఏం మాయ చేసావో
నీ బానిసగా చేసుకున్నావె
ఏం మంత్రం వేసావో
నా గుండె నీ నామస్మరణే జపిస్తున్నదె
ఏం మత్తు చల్లావో
ప్రతి క్షణం నీ మైకంలోనే గడుపుతున్నానె
ఏం పవరుందో ఆ చూపుల్లో
దృష్టి మరల్చలేకుండా వున్నానె
ఏం హొయలున్నవో ఆ నడకలో
రెప్ప వేయలేకున్నానె
ఏం మహిమ వుందో ఆ నడతలో
సమ్మోహితుడనయ్యానె
నాకంటూ ఏమీలేక
నిశీథిలో మిగిలానె.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి